దుబ్బాక ఉపఎన్నిక.. ఐదో రౌండ్ లో కూడా బీజేపీకి ఆధిక్యత!

  • దుబ్బాకలో కొనసాగుతున్న రఘునందన్ రావు దూకుడు
  • ఐదో రౌండ్ ముగిసే సరికి రఘునందన్ కు 3,020 ఓట్ల ఆధిక్యం
  • దారుణమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ
దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ లో ఐదో రౌండ్ లో కూడా బీజేపీ సత్తా చాటింది. అధికార టీఆర్ఎస్ కు ఐదో రౌండ్ తర్వాత కూడా నిరాశే ఎదురైంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే వస్తున్నారు. ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ ఆధిక్యత 3 వేలు దాటింది. తన సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థిపై రఘునందన్ రావు 3,020 ఓట్ల ఆధిక్యతను సాధించారు.

బీజేపీకి ఇప్పటి వరకు 16,517 ఓట్లు రాగా... టీఆర్ఎస్ కు 13,497 ఓట్లు పడ్డాయి. 2,724 ఓట్లను మాత్రమే సాధించిన కాంగ్రెస్ పార్టీ దారుణమైన స్థితిలో ఉంది. అయితే, రానున్న రౌండ్లలో ఫలితాలలో ఏదైనా మార్పు వస్తుందా? లేక ఇదే సరళి కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.

Dubbaka
Raghunandan Rao
BJP

More Telugu News